శ్రీ సత్య సాయి జిల్లా కొత్తచెరువులో శుక్రవారం పీఎం రైతుల సమృద్ధి కేంద్రం వద్ద యూరియా కోసం రైతులు భారీగా బారులు తీరారు. వరి నాట్లు వేసినా ఎరువుల లభ్యత లేక ఇబ్బందులు పడుతున్నామన్నారు. ఎండను లెక్క చేయకుండా ఉదయం నుంచే వేచి ఉన్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై ఏవో సతీశ్ మాట్లాడుతూ 160 బ్యాగులు వచ్చాయని, లాగిన్ ఐడీ రాగానే పంపిణీ చేస్తామని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా యూరియా కొరత రైతులను ఇబ్బందులకు గురి చేస్తోంది.