భీమిలి నియోజకవర్గం వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలు గత రెండు రోజులుగా కురుస్తున్నాయి. బుధవారం అర్ధరాత్రి నుండి వర్షం కారణంగా పరదేశిపాలెం హైవే నుంచి పాతపరదేశీపాలెం వెళ్లే దారిలో ఉన్న వంతెన పైనుంచి నదీ ప్రవాహంలా నీరు ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. దీంతో ప్రధానంగా కొండపేట నూతన కాలనీ, పాత పరదేశీపాలెం, కే.నగరంపాలెంకు రాకపోకలు బందయ్యాయి. నడిచి వెళ్లేవారు ఎక్కడికక్కడే నిలిచిపోయే పరిస్థితి ఏర్పడింది.