మరిపెడ పట్టణంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సమీపంలో ప్రధాన జాతీయ రహదారిపై బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో వీధి వ్యాపారులైన తల్లీ కూతుళ్లకు గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల మేరకు కూరగాయల వ్యాపారం ముగించుకుని ఇంటికి వెళ్తున్న జెస్సిక, రమ రహదారిపై ఎదు రుగా వస్తున్న వారిని ద్విచక్రవాహనం ఢీకొట్టింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారిని స్థాని కులు 108 వాహనంలో ఏరియా ఆసుపత్రికి తర లించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరు కొని విచారణ చేపట్టారు.