ఏలూరు జిల్లా కుక్కునూరు, వేలూరుపాడు మండలాల్లో వరద ముప్పు గ్రామాలను కలెక్టర్ వెట్రి సెల్వి, జేసీ గురువారం పడవలో పర్యటించారు. గ్రామాలలో వరద పెరిగే అవకాశం ఉన్నందున ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని కలెక్టర్ సూచించారు. అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి పరిస్థితులను తెలియజేయాలని ఆదేశించారు. ప్రజల ప్రాణ రక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని, అవసరమైన సహాయక చర్యలను వెంటనే చేపట్టాలని సూచించారు..