హైదరాబాద్ జిల్లా: హైదరాబాద్ బుద్ధ భవన్ లో హైడ్రా ప్రజావాణి సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ పాల్గొని ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు సోమవారం ప్రజావాణిలో 36 ఫిర్యాదులు అందాయని తెలిపారు. రహదారులు పార్కులు కబ్జా కాకుండా చూడాలని నారాలపై అక్రమ కట్టడాలు ఉన్నాయని పలువురు ఫిర్యాదులు చేశారన్నారు. సమస్యల పరిష్కారం బాధ్యతలను సంబంధిత అధికారులకు అప్పగించినట్లు హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ తెలిపారు.