పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గం లో అక్రమ వ్యాపారాలు ముఠాలవారీగా పంచుకుంటున్నారని మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు తీవ్రంగా విమర్శలు చేశారు, ఈ సందర్భంగా వినుకొండ పట్టణంలో ఆయన సోమవారం సాయంత్రం ఐదు గంటల సమయంలో మీడియాతో మాట్లాడుతూ కూటమి నేతలు మద్యం బెల్టు షాపులు అక్రమ గ్రావెల్ రేషన్ బియ్యం రవాణా వంటి వ్యాపారాలను మండలానికి ఒక ముఠాగా పంచుకుంటున్నారని ఆరోపించారు. నియోజకవర్గంలో అక్రమంగా కొండల కొండలు గ్రావెల్ తరలిపోవడం లేదా అని ప్రశ్నించారు. ఈ అక్రమాలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.