మచిలీపట్నం లో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణముగా జిల్లాలో ఈ నెల 10 నుండి 12 తేదీ వరకు చిరు జల్లులు కురిసే అవకాశం ఉందని కృష్ణా జిల్లా కలెక్టర్ డికే. బాలాజీ ఆదివారం ఒక ప్రకటనలో తెలియజేశారు. కావున కృష్ణా జిల్లాలో ఇప్పటికే కోతలు కోసిన వారు ధాన్యమును మిల్లులకు లేదా సురక్షితమైన ప్రదేశాలకు తరలించుకోవాలని తెలియజేశారు. కోతకు సిద్ధముగా ఉన్న పొలాలను కోతలు కోయకుండా తాత్కాలికంగా వాయిదా వేసుకోవలసినదిగా కోరారు.