జే చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల పథకం మూడో దశలో ప్రధానమైన రామప్ప - ధర్మసాగర్ టన్నెల్ (సొరంగం) నిర్మాణం పూర్తయ్యింది. ఈ పనులు చేసిన కాంట్రాక్టు కంపెనీ ములుగులో సుమారు 20 ఎకరాల్లో శాఖను ఏర్పాటు చేసి 15 ఏళ్లు కొనసాగించింది. ప్రాజెక్టు కంప్లీట్ కావడంతో సైట్ను ఖాళీ చేస్తోంది. అయితే భారీ యంత్రాలు, వాహనాలు నెలల తరబడి నిరూపయోగంగా ఉండటంతో తుప్పుపట్టి పోయాయి. వాటిని ముక్కలుగా చేసి వేరే చోటకు తరలిస్తున్నారు.