ఓబులవారిపల్లి మండలములో ఎక్కడ మండపం ఏర్పాటు చేయాలన్న పోలీసుల అనుమతి తప్పనిసరి అని ఓబులవారిపల్లి ఎస్సై మహేష్ బాబు సూచించారు. ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్లో శనివారం గణేష్ మండపాల నిర్వాహకులతో ఆయన సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వినాయకుడి విగ్రహ ప్రతిష్టకు అన్ని నిబంధనలు పాటించాలని, అతిక్రమిస్తే చర్యలు తప్పవు అన్నారు. విగ్రహాలు ట్రాక్టర్ లో తీసుకెళ్తున్నప్పుడు విగ్రహాల ఎత్తు వల్ల కొన్ని ప్రదేశాల్లో ఎలెక్ట్రికల్ వైర్స్ తగిలి, విగ్రహాలు తీసుకెళ్తున్న వారికి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు. అలా ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్త లు తీసుకోవాలని సూచించారు.