భారీ వరదల వల్ల నీట మునిగిన ఇండ్ల బాధితులకు శనివారం సాయంత్రం నాలుగు గంటలకు రెవెన్యూ అధికారులు నిత్యవసర సరుకులను పంపిణీ చేశారు. 192 ఇండ్లు నీట మునిగినట్లుగా గుర్తించిన అధికారులు తక్షణ సహాయం కింద బియ్యము, కందిపప్పు ,వంట నూనెను అందజేసినట్లు తహసిల్దార్ వీర్ సింగ్ తెలిపారు. చందూర్ మాజీ జెడ్పిటిసి అంబర్ సింగ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సాయరెడ్డి ,సొసైటీ చైర్మన్ అశోక్ పాల్గొన్నారు.