భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ సూచన మేరకు సేవా పక్వాడ్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా సోమవారం రామగుండం కార్పొరేషన్ పరిధిలో సేవా అభియాన్ అసెంబ్లీ కన్వీనర్ కొండపర్తి సంజీవ్ కుమార్ ఆధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం నుండి గోదావరిఖని ప్రధాన చౌరస్తా వరకు నమో మారథాన్ యువభారత్ ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి కోమల మహేష్, మరియు సేవా అభియాన్ అసెంబ్లీ కన్వీనర్ కొండపర్తి సంజీవ్ కుమార్ లు మాట్లాడుతూ దేశంలో విద్యార్థి యువత సేవా భావం వైపు అడుగులు వేయాలని, తద్వారా డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించాలన్నారు.