పెదగంట్యాడ నుంచి గాజువాక వైపు వెళ్లే ఆర్టీసీ బస్సులలో కాలేజీ విద్యార్థులు ఫుట్ బోర్డుపై ప్రమాదకర ప్రయాణం కొనసాగిస్తున్నారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. మహిళల ఫ్రీ బస్సుల కారణంగా బస్సులు అసలు ఖాళీ ఉండటం లేదని ఎట్టి పరిస్థితుల్లోనూ సమయానికి కాలేజీలకు చేరుకోవాలంటే ఫుట్ బోర్డు ప్రయాణాలు తప్పడం లేదని విద్యార్థులు చెబుతున్నట్లుగా వారి తల్లిదండ్రులు చెబుతున్నారు. ప్రభుత్వం విద్యార్థుల కోసం ప్రత్యామ్నాయ మార్గాలు చూపాలని కోరుతున్నారు.