ఓర్వకల్లు మండలం హుస్సేనాపురం గ్రామంలో గత రెండు రోజుల క్రితం వైసీపీ కార్యకర్త మధు ఇంటిపై టీడీపీ నాయకులు ఇంటిపైకి రాళ్లతో దాడికి పాల్పడిన విషయాన్ని జిల్లా వైసీపీ అధ్యక్షులు పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. బాధితుని కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా కాటసాని రాంభూపాల్ రెడ్డి మాట్లాడుతూ టిడిపి ప్రభుత్వం టిడిపి నాయకులు కార్యకర్తలు గెలిచినప్పటి నుంచి వైసీపీ కార్యకర్తలపై కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారు,