సమస్యల పరిష్కార వేదికలో జిల్లావ్యాప్తంగా వచ్చిన ఫిర్యాదులను స్వయంగా ఆలకించిన ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడు, బాధితులకు న్యాయం చేయాలని, తక్షణమే చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులకు ఆదేశించారు. ముఖ్యంగా వృద్ధులు, వికలాంగులు, మహిళల సమస్యలకు ప్రాధాన్యతనిస్తూ, చట్టపరమైన పరిధిలో మానవీయంగా స్పందించాలని స్పష్టం చేశారు. కుటుంబ కలహాలు, సైబర్ మోసాలు, భూ వివాదాలు, అధిక వడ్డీలు వంటి ఫిర్యాదులపై వెంటనే విచారణ జరపాలని ఆదేశాలు జారీ చేశారు.