కాకినాడ జిల్లా రౌతులపూడి కోటనందూరు మండల రహదారిలో ఖరీఫ్ వరి నాట్లు ప్రక్రియ తుది ధశకు చేరుకుంది. రెండు రోజులుగా విస్తారంగా వర్షాలు కురవడంతో మెట్ట గ్రామాలైన భీమవరంకోట. ఎస్ఆర్ పేట.బిలనందూరు.ఇందుగుపల్లి.బొద్దవరం.తదితర గ్రామాల్లో రైతులు జోరుగా బుధవారం వరినాట్లు వేశారు. వర్షంతో పాటు తాండవ జలాశయం నీరుకూడా వస్తుందని ఖరీఫ్ కు ఎలాంటి ఇబ్బంది ఉండదు అని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు