ములుగు జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో నేడు బుధవారం మధ్యాహ్నం ఒంటిగంటకు చాకలి ఐలమ్మ 40 వ వర్ధంతి కార్యక్రమంలో మంత్రి సీతక్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ... తెలంగాణ సాయుధ రైతంగ పోరాటంలో కీలకపాత్ర పోషించిన వారు వీరనారి చాకలి ఐలమ్మ అని, తొలి భూ పోరాటానికి నాంది పలికిన విప్లవ నిప్పు కణిక ఐలమ్మని కొనియాడారు. భూమికోసం, భుక్తి కోసం తిరుగుబాటు చేసి ప్రజా వ్యతిరేక పాలనపై దండెత్తిందని గుర్తు చేశారు.