రాష్ట్ర ప్రభుత్వం కవులకు అందజేస్తున్న అవార్డుల ఎంపికలో ఉమ్మడి జిల్లాలోని కవులకు అన్యాయం జరుగుతుందని ప్రముఖ కవి, వైద్యులు సినారె అవార్డు గ్రహీత దామెర రాములు అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో శనివారం సమావేశం నిర్వహించారు. ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన గద్దర్, దాశరథి అవార్డుల కమిటీ నిర్మల్ జిల్లాలోని కవులను పరిగణలోకి తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతోమంది రచయితలు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో అవార్డులు అందుకున్న వారు ఉన్నారని ఇప్పటికైనా అవార్డుల ఎంపిక కమిటీ నిర్మల్ జిల్లా కవులను పరిగణలోకి తీసుకోవాలని కోరారు.