నగరి నియోజకవర్గ పరిధిలోని నిండ్ర, విజయపురం మండలాలలో రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా రూపొందించిన స్మార్ట్ రేషన్ కార్డులను ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ శనివారం లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం మహిళాభివృద్ధికి పెద్దపీట వేస్తుందని, పథకాలు మహిళల పేరుతోనే వచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఎన్నికల హామీలను నెరవేరుస్తున్న ఘనత చంద్రబాబుకే దక్కిందని అన్నారు.