పోరాట స్ఫూర్తికి ప్రతీకగా వీర వనిత చాకలి ఐలమ్మ నిలుస్తారని అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి అన్నారు. వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతిని పురస్కరించుకుని అదనపు కలెక్టర్, కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో వీరనారి చాకలి ఐలమ్మ చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.