ఏర్పేడు: అన్నదాత పోరుబాట పోస్టర్ల ఆవిష్కరణ ఏర్పేడులో సోమవారం వైసీపీ మండల అధ్యక్షులు రమణయ్య యాదవ్ అన్నదాత పోరుబాట పోస్టర్లను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రతి రైతు 'అన్నదాత పోరుబాట కార్యక్రమానికి హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఉదయం తొమ్మిది గంటలకు శ్రీకాళహస్తి ఆర్డీఓ కార్యాలయం వద్ద కార్యక్రమం ప్రారంభం కానున్నట్లు వివరించారు.