మావల పోలీస్ స్టేషన్ పరిధిలోని కే.ఆర్.కే కాలనీలో కమ్యూనిటీ పోలీసింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా నార్కోటిక్ స్నిఫర్ జాగిలం 'రోమా' తో తనిఖీలు నిర్వహించారు. ఓ ఇంట్లో గంజాయి ఉన్నట్లు నార్కోటిక్ జాగిలం గుర్తించింది. ఈ మేరకు పోలీసులు అప్రమత్తమై ఇంట్లో పరిశీలించగా 10 గ్రాముల గంజాయి, మూడు గంజాయి మొక్కలు లభ్యమయ్యాయి. ఆదిలాబాద్ డీఎస్పీ జీవన్ రెడ్డి రోమాను అభినందించారు.