ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం శానంపూడి గ్రామానికి చెందిన రహదారికి మంగళవారం జనసేన నాయకులు కార్యకర్తలు మరమ్మతులు చేపట్టారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఏదైనా మంచి కార్యక్రమాన్ని చేపట్టాలని ఉద్దేశంతో గుంతలు ఏర్పడ్డ శానంపూడి రహదారికి మరమ్మతులు చేపట్టినట్లుగా జనసేన నాయకులు తెలిపారు. ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు పరిగెడుతుందని నిరసన నాయకులు అన్నారు.