కడప జిల్లా కమలాపురం నియోజకవర్గ పరిధిలోని చెన్నూరు మండలానికి చెందిన వెంకటసుబ్బయ్య నాంచారమ్మ దంపతులు కనిపించడం లేదని గురువారం పోలీస్ స్టేషన్లో కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. వెంకటసుబ్బయ్య నాంచారమ్మ దంపతులు బుధవారం ఉదయం 11 గంటల నుంచి కనిపించటం లేదని వారి కుమారుడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ విషయమై పోలీసులు విచారణ చేపట్టారు. ఈ వృద్ధ దంపతుల గురించి ఎవరికైనా ఆచూకీ తెలిస్తే సమీప పోలీస్ స్టేషన్కు వెళ్లి పోలీసులకు సమాచారం ఇవ్వాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. వీరికి సంబంధించిన సమాచారం తెలిసిన వారు 9440838584 నంబర్ కు తెలపాలన్నారు.