కడప జిల్లా ప్రొద్దుటూరు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం సాయంత్రం నాలబై బస్తాల రేషన్ బియ్యం పట్టుకుని సీజ్ చేశారు. త్రీ టౌన్ సీఐ. వేణుగోపాల్ వివరాల మేరకు ప్రొద్దుటూరు పట్టణం వైఎంఆర్ కాలనీలో బొలెరో వాహనంలో అక్రమంగా తరలిస్తున్న 40 రేషన్ బియ్యం బస్తాలను పట్టుకున్నట్టు తెలిపారు. ప్రొద్దుటూరు నుంచి మైదుకూరుకు తీసుకెళుతున్నట్లు గుర్తించిన పోలీసులు మైదుకూరు మండలం గొల్లపల్లి కు చెందిన పవన్ కుమార్ పై కేసు నమోదు చేసి సమగ్రంగా విచారిస్తున్నామని తెలిపారు.