శనివారం వనపర్తి జిల్లా కేంద్రంలోని ఐడిఓసి సమావేశం మందిరంలో సమావేశమైన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు జిల్లెల చిన్నారెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్వేపల్లి తన పుట్టినరోజును టీచర్స్ డే గా జరుపుకోవాలని సూచించడంతో యావత్ దేశవ్యాప్తంగా టీచర్స్ డే ను నిర్వహించుకుంటున్నామని విద్యార్థులను ఉన్నత శిఖరాలకు చేర్చడంలో ఉపాధ్యాయుని పాత్ర అత్యంత కీలకమైందని ఈ సందర్భంగా అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఎస్పి రావుల గిరిధర్ జిల్లా అధికారులు ఉపాధ్యాయులు తదితరులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.