శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి మండలం వెన్నెల వలస వద్ద థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణ ప్రతిపాదనలను స్థానిక ఆదివాసీలు అడ్డుకున్నారు. ఆముదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ ఆదేశాల మేరకు అధికారులు ప్లాంట్ నిర్మాణ పరిశీలనకు బుధవారం సాయంత్రం నాలుగు గంటల 30 నిమిషాలకు వెన్నెల వలస వద్దకు చేరుకోగా స్థానిక ఆదివాసీలు అడ్డుకున్నారు.. తమ బ్రతుకులు ఎప్పటికీ ఇబ్బందుల్లో ఉన్నాయని ఈ ప్లాంట్ నిర్మాణం జరిగితే అధోగతి పాలవుతామని ఆదివాసీలు తమ ఆవేదనను వ్యక్తం చేశారు..