వజ్రకరూరు మండల సమీపంలో హంద్రీ నీవా కాలువలో మృతదేహం లభ్యమైంది. బసన్నగౌడు (53) కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం హలహర్వి మండలం సిద్ధాపురం నివాసిగా నిర్ధారించారు. పోలీసుల వివరాల మేరకు అతడు 27న గుంతకల్లుకు వచ్చాడు. చిప్పగిరికి వెళ్లే దారిలో కాలువ గట్టుపైన ఆధార్ కార్డు, దుస్తులు గుర్తించి. స్థానికులు 28న ఆధార్లోని నంబర్కు ఫోన్ చేసి మాట్లాడారు. కాలు వలో దిగి వెతికినా ఆచూకీ లభించలేదు. శనివారం హంద్రీనీవా కాలువ రాగులపాడు పంపు హౌస్ దగ్గర లభ్యమైంది. మృతదేహన్ని పోస్టు మార్టం కోసం గుంతకల్లు ఆసుపత్రికి తరలించారు.