గుత్తి శివారులోని కాసేపల్లి టోల్గేట్ సమీపంలో శనివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కర్ణాటక నుంచి మంత్రాలయం వెళ్తున్న కారు అదుపుత తప్పి రోడ్డు డివైడర్ను ఢీకొనింది. ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న బెంగళూరుకు చెందిన ఒకే కుటుంబ సభ్యులు విమలమ్మ, మమత, భరత్ లు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వారిని హైవే అంబులెన్స్ లో గుత్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విమలమ్మ కు తీవ్ర గాయాలు కావడంతో మెరుగైన వైద్యం కొరకు అనంతపురం రెఫర్ చేశారు.ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.