అనంతపురం జిల్లా కేంద్రంలో సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభ సందడి నెలకొంది. టిడిపి శ్రేణులు వందలు వేల సంఖ్యలో సభ ప్రాంగణానికి చేరుకున్నారు. అనంతపురం నగరవ్యాప్తంగా టిడిపి జెండాలు రెపరెపలాడాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చిన తర్వాత భారీ ఎత్తున సభను నిర్వహిస్తున్న నేపథ్యంలో టిడిపి శ్రేణులు వందలు వేల సంఖ్యలో కార్యక్రమానికి తరలి వెళ్లారు.