అర్హుల పేరుతో వికలాంగ పెన్షన్లు నిలిపివేయాలనే ఆలోచన ప్రభుత్వం మానుకోవాలని ఏపీ పెన్షన్ దారుల సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆంధ్రయ్య ప్రభుత్వాన్ని కోరారు. చిట్వేల్ మండల కేంద్రంలో శనివారం ఆయన మాట్లాడుతూ.. సదరం సర్టిఫికెట్ల కేటాయింపులో అర్హులకు అన్యాయం జరిగిందని, అనర్హులు సులభంగా సర్టిఫికెట్లు పొందారని ఆయన అన్నారు. వాటిని పరిగణ లోకి తీసుకుంటే, పేద, బడుగు,బలహీన వర్గాలకు చెందిన దివ్యాంగులు జీవించడం కష్టతరమవుతుందని, ప్రభుత్వం ఏ విషయంలో పునరాలోచించాలని ఆయన కోరారు.