సత్తుపల్లి పట్టణం-రజక కమ్యూనిటీ హాల్ - వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన సత్తుపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్ అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆమె పోరాట పటిమనుస్మరించుకున్నారు.తెలంగణ వీరనారి ఉద్యమమే ఊపిరిగా పేదల అభివృద్ధే ద్యేయంగా వెట్టిచాకిరి విముక్తిని పారద్రోలి,భూమి కోసం ,భుక్తి కోసం పోరాడిన ధీశాలి మన చాకలి ఐలమ్మ అని అన్నారు.ఆమె ఆశయాల సాధనకు నేటి యువత అడుగులు వేయాలనీ ఎమ్మెల్యే గారు పిలుపునిచ్చారు.. అనంతరం దోబి ఘాట్ నందు మొక్కలు నాటారు..