చిత్తూరు జిల్లా విద్యార్థులకు గమనిక చిత్తూరు జిల్లా విద్యార్థులు ఈనెల 30వ తేదీలోపు నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ పరీక్షకు దరఖాస్తు చేసుకోవాలని DEO వరలక్ష్మి కోరారు. దరఖాస్తుకు సర్టిఫికెట్లు అవసరం లేదని, పరీక్ష రాసే సమయానికి అన్ని సర్టిఫికెట్లు సిద్ధం చేసుకోవాలని సూచించారు. ఓసీ, బీసీ విద్యార్థులు రూ.100, ఎస్సీ, ఎస్టీ పిల్లలు రూ.50 పరీక్ష ఫీజు ఆన్లైన్ అప్లికేషన్ సమయంలో ఇచ్చే ఎస్బీఐ కలెక్ట్ లింక్లోనే చెల్లించాలన్నారు.