పేదల మనసెరిగిన మహానేత డాక్టర్ వైయస్సార్ అని వైయస్సార్సీపి రాష్ట్ర అధికార ప్రతినిధి, రైల్వేకోడూరు మాజీ శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు అన్నారు. దివంగత ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 16వ వర్ధంతి సందర్భంగా మంగళవారం రైల్వేకోడూరు టోల్గేట్ వద్ద ఉన్న ఆయన కాంస్య విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన ప్రవేశపెట్టిన పథకాలు నేటికీ కొనసాగుతున్నాయని, ఆ పథకాలు చిరంజీవులు అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ రామిరెడ్డి ధ్వజారెడ్డి, పట్టణ అధ్యక్షుడు సిహెచ్ రమేష్, జడ్పిటిసి రత్నమ్మ పాల్గొన్నారు.