*అధికారులు పీజీ ఆర్ ఎస్ అర్జీలు సకాలంలో నాణ్యతగా పరిష్కరించాలి అని, ఈపీటిఎస్ పోర్టల్ నందు ఏజెంట్ స్పేస్ డాక్యుమెంట్ల అప్లోడ్ రోజు వారీగా 100 కి తక్కువ లేకుండా చేయాలని, పీఎం కుసుమ్ భూసేకరణ, igot కరమ్ యోగి నందు కెపాసిటీ బిల్డింగ్ కోర్సులు 191 పూర్తి చేయాలని, రైతు ఖాతాలకు సంబంధించి ఎన్పిసిఐ పెండింగ్ లింకింగ్ త్వరితగతిన పూర్తి చేయాలని, వెబ్ ల్యాండ్ కరెక్షన్ అంశాలు తదితరాలను బాధ్యతగా చేపట్టాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ఆదేశించారు. మంగళవారం సాయంత్రం 6:30 గంటల సమయంలో అనంతపురము కలెక్టరేట్ నందు మినీ మీటింగ్ హాల్ నందు పలు అంశాలపై అధికారులతో సమీక్షించారు.