జిల్లా వ్యాప్తంగా హెల్మెట్ ధరించకుండా ద్విచక్ర వాహనాలను నడిపిన వారిపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించి 1016 కేసులు నమోదు చేసి రూ 10,16,000/-ల ఈ-చలానాలుగా విధించామని జిల్లా ఎస్పీ శ్రీ డి. నరసింహ కిషోర్ సోమవారం రాత్రి తెలిపారు రాష్ట్ర డిజిపి హరీష్ కుమార్ గుప్త ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్లు పరిధిలో ఆగస్టు 18వ తేదీ నుండి 24వ తేదీ వరకు హెల్మెట్ ధరించకుండా ద్విచక్ర వాహనాలు ఉన్నాయి వారిపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించి కేసులు నమోదు చేసినట్టు తెలిపారు.