చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని తిరుపతి జిల్లా గూడూరు ప్రిన్సిపల్ సివిల్ జడ్జి సులోచన రాణి మంగళవారం పేర్కొన్నారు. మంగళవారం మండల పరిధిలోని చెన్నూరులో చట్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సీనియర్ సివిల్ జడ్జి రాజేశ్ మండల లీగల్ సర్వీసెస్ అథారిటీ సభ్యులు ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పించారు. చట్టానికి లోబడి అందరూ నడుచుకోవాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు