విజయనగరం జిల్లాలో ఐటి పార్కులను ఏర్పాటు చేసేందుకు అవసరమైన భూములను గుర్తించాలని కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆదేశించారు. రెవెన్యూ అధికారులతో తమ ఛాంబర్లో మంగళవారం సమావేశాన్ని నిర్వహించారు. రాజాపులోవ నుంచి భోగాపురం విమానాశ్రయం వరకు జాతీయ రహదారికి ఇరువైపులా 15 కిలోమీటర్ల పరిధిలో స్థలాలను గుర్తించాలని సూచించారు. ఒక్కో బ్లాకు కనీసం వంద ఎకరాలు ఉండేలా చూడాలన్నారు. ఇలా సుమారు 5000 ఎకరాలను గుర్తించాల్సి ఉందన్నారు. ప్రభుత్వ భూములకు ప్రాధాన్యత ఇవ్వాలని, లేని పక్షంలో ప్రయివేటు భూములను గుర్తించాలని సూచించారు.