సింగరేణిలో మారుపేర్ల బాధితుల డిపెండెంట్ ల సమస్యలను పరిష్కారం చేయాలని కోరుతూ aituc యూనియన్ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య కాళ్ళను పట్టుకొని మోరపెట్టుకున్నారు. మంగళవారం స్థానిక భాస్కరాభవన్లో ఏఐటియుసి నేత వాసిరెడ్డి సీతారామయ్య ఆఫీసులో ఉన్నారని సమాచారం మేరకు మారుపేర్ల డిపెండెంట్ బాధితులు ఏఐటియుసి నాయకులతో వాసిరెడ్డి సీతారామయ్యతో డిపెండెంట్ ల మారుపేర్ల సమస్యపై చర్చించారు. ఇందులో భాగంగా డిపెండెంట్ ల మారుపేర్ల సమస్యను పరిష్కారం చేయాలంటూ గుర్తింపు సంఘం ఏఐటియుసి అధినేత వాసిరెడ్డి సీతారామయ్య పాదాలను పట్టుకొని మాకు న్యాయం చేయండి అంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.