తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలంలోని చెంబడిపాలెం వద్ద మంగళవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ రోడ్డు ప్రమాదంలో నలుగురికి గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో పోలీసులు క్షతగాత్రులను నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వినాయక విగ్రహాల కోసం వెళుతుండగా ప్రమాదం జరిగిందని స్థానికులు చెప్పారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ మేరకు పోలీసులు విచారణ చేపడుతున్నట్లు సమాచారం.