పేపర్ ప్లేట్స్ తయారీదారుల అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాము చిన్న పరిశ్రమల ఆధారంగా పేపర్ ప్లేట్స్ తయారీ చేస్తున్నామని కానీ ప్రస్తుతం తమ బ్రతుకులు రోడ్డుమీద పడ్డాయని తీవ్ర ఆవేదనను వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని వారు కమిషనర్ను వేడుకున్నారు.