కుటుంబ సమేతంగా చూడదగిన సినిమా సుందరకాండను ఈ నెల 27వ తేదీ వినాయక చవితి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్టు సినీ హీరో నారా రోహిత్ తెలిపారు శనివారం రాజమండ్రి హోటల్ షెల్తాన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా సినిమాను తయారు చేసినట్టు తెలిపారు. ప్రేక్షకులంతా సినిమాను ఆదరించి విజయవంతం చేయాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు.