జీడి నెల్లూరు నియోజకవర్గ వ్యాప్తంగా మంగళవారం మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతిని నియోజకవర్గ ఇన్చార్జ్ కృపా లక్ష్మి, వైసీపీ నాయకులు ఘనంగా జరుపుకున్నారు. ఆయన విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. పేదలకు అన్నదానం, సంక్షేమ పథకాలను గుర్తు చేసుకున్నారు. రైతులకు ఉచిత విద్యుత్ అందించిన ఘనత రాజశేఖర్ రెడ్డిది అని కృపా లక్ష్మి తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పాల్గొన్నారు.