అర్జీల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆదేశించారు. టెక్కలి నియోజకవర్గం, కోటబొమ్మాళి మండలం,నిమ్మడ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు గురువారం అర్జీలు స్వీకరించారు ఈ సందర్భంగా గ్రీవెన్స్ కు వచ్చిన అర్జీదారుల నుంచి వినతులను ఆయన స్వీకరించి వారి నుండి నేరుగా సమస్యలను తెలుసుకొన్నారు. అర్జీదారుల నుంచి వచ్చిన ప్రతి అంశాన్ని జాగ్రత్తగా పరిశీలించి, సంబంధిత శాఖల అధికారులకు వెంటనే పంపిస్తూ అర్జీలు పరిష్కార దిశగా చర్యలు తీసుకోవాలన్నారు.