రాయచోటి పట్టణంలోని కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలలో శుక్రవారం వైష్ణవి అనే విద్యార్థిని పాము కాటుక గురయింది. ఉపాధ్యాయుల సహాయంతో ఆమెను వెంటనే రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడంతో ప్రమాదం తప్పినట్లు అయింది వైద్యులు చికిత్స అందించారు ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు నిర్ధారించారు.