ఓతొమ్మిది రోజులు ఘనంగా పూజలు అందుకున్న గణనాథుని నిమజ్జనం ప్రశాంతంగా, సజావుగా జరగాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ అన్నారు.నెల్లుట్ల చెరువులో జరుగుతున్న వినాయక నిమజ్జన తీరును అలాగే వివిధ శాఖల ద్వారా చేసిన ఏర్పాట్లను డీసీపీ రాజమహేంద్ర నాయక్,ఏసీపీ పండరి చేతన్ లతో కలిసి జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ శనివారం పరిశీలించారుముందుగా కలెక్టర్ నిమజ్జనం కోసం తీసుకొచ్చిన గణనాధునికి పూజలు చేయడం తో పాటు,నిమజ్జనం జరిగే తీరును స్వయం గా పరిశీలించి, సిబ్బంది కి పలు సూచనలు జారీ చేసారు.నిమజ్జనం ప్రశాంతంగా జరిగేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు.