నర్సుల్లాబాద్ మండలం బైరా పూర్ గ్రామంలో అసైన్మెంట్ భూముల పేరిట కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు సోమవారం 12 గంటలకు కామారెడ్డి జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. భూమిని కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకుంటూ, భూమిని రికవరీ చేయాలని కలెక్టర్ ఇచ్చిన ఫిర్యాదులో గ్రామస్తులు కోరారు.