సెప్టెంబర్ 5వ తేదీన గణపతి నిమర్జనం చేయడం జరుగుతుందని ఏటూరునాగారం స్పెషల్ ఆఫీసర్ రాంపతి అన్నారు. మంగళవారం మధ్యాహ్నం స్థానిక MPDO కార్యాలయంలో ఉత్సవ కమిటీలతో సమావేశం నిర్వహించారు. రాంపతి మాట్లాడుతూ.. ఈనెల 27 నుంచి 4వ తేదీ వరకు భక్తిశ్రద్ధలతో గణేష్ నవరాత్రి వేడుకలు జరుపుకోవాలన్నారు. కాగా, ముళ్లకట్ట వద్ద గోదావరిలో ప్రత్యేక క్రేన్లతో నిమజ్జనం ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఎంపీడీఓ శ్రీనివాస్, తహశీల్దార్ పాల్గొన్నారు.