నకిలీ ట్రాన్స్ జెండర్లు నుండి తమకు ప్రాణహాని ఉందని బాన్సువాడ పట్టణానికి చెందిన ట్రాన్స్ జెండర్లు శనివారం మధ్యాహ్నం ఒంటిగంటకు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కామారెడ్డికి చెందిన నకిలీ ట్రాన్స్ జెండర్లు ఒక ముఠాగా ఏర్పడి బాన్సువాడ లో వ్యాపారస్తుల వద్ద బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారని స్థానికులమైన మాకు బెదిరిస్తూ నెలనెలా ఒక్కొక్కరు 3 వేల రూపాయలు చెల్లించాలని హుకుం జారీ చేశారని బాన్సువాడ ట్రాన్స్ జెండర్లు ఆరోపించారు. దీప్తి అలియాస్ సంతోష్ అనే నకిలీ ట్రాన్స్ జెండర్లు ముఠా నుండి తమకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలని బాన్సువాడకు చెందిన ట్రాన్స్ జెండర్లు కోరారు.