గత ఆగస్టు నెలలో కలెక్టర్ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థినీ విద్యార్థులకు విత్తన సేకరణ అనే అంశం మీద కాంపిటీషన్ నిర్వహించడం జరిగినది అట్టి పోటీలు కాంప్లెక్స్ స్థాయి మరియు మండల స్థాయి విత్తన సేకరణ కార్యక్రమం చేపట్టినారు అందులో భాగంగ జూలూరుపాడు కాంప్లెక్స్ స్థాయిలో జూలూరుపాడు ఉన్నత పాఠశాల ప్రథమ స్థానము మరియు మండల స్థాయిలో కూడా ప్రథమ స్థానము సాధించడం జరిగింది. మండల స్థాయిలో విత్తన సేకరణ కార్యక్రమంలో జూలూరుపాడు పాఠశాల నుండి విద్యార్థిని విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయుల ప్రోత్సాహంతో సుమారుగా 156 రకాల విత్తనాలను సేకరించి మండల స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచారు