ఉయ్యూరులోని తోటవల్లూరు రోడ్డులో ఉన్న ఒక గోడౌన్లో రూ. 10 లక్షలకు పైగా విలువైన నిషేధిత సిగరెట్లను స్వాధీనం చేసుకున్నట్లు జీఎస్టీ అధికారిణి సౌమ్య తెలిపారు. సోమవారం తమకు అందిన సమాచారం మేరకు గోడౌన్ను తనిఖీ చేయగా, ఎటువంటి బిల్లులు లేని సుమారు 90 కార్టన్ల సిగరెట్ బాక్సులను పట్టుకున్నట్లు ఆమె చెప్పారు.